Saturday, December 22, 2012

ఫ్లెవర్స్

ఫ్లెవర్స్ తయారు చెయ్యడానికి కావలసిన వస్తువులు




అట్టపెట్టె

పెన్సిల్

కత్తెర

కలర్స్

పెయింట్ బ్రస్ 

 తయారు చేయు విధానము :

ముందుగ మన దగ్గర ఉన్న చీరల పెట్టెలు గాని, కార్నఫ్లెక్స్  లేదా బిస్కెట్స్ పెట్టెలు గని  తీసుకోవాలి. పెట్టెను ఒక ప్రక్క కట్ చెసుకోవాలి, కట్ చెసుకున్న పెట్టెను వెనుక ప్రక్కకు అంటె తెల్లని ప్రక్కకు తిప్పుకోవాలి, తిప్పుకున్న తరువాత పెన్సిల్ తీసుకొని మనకు కావలసిన పువ్వు సయిజ్ ను బట్టి ఒక సర్కెల్ గీసుకొవాలి, తరువాత దానిని పువ్వులాగ రేకులు వేసుకోవాలి, ఇపుడు కత్తెర తీసుకొని పువ్వు అంచుల చుట్టూ కట్ చేసుకుంటూ రావాలి. కట్ చేసిన పువ్వు కి మనకి నచ్చిన రంగు వేసుకొవాలి, తరువాత పువ్వు రేకులను రంగు వెసుకున్న వైపుకు ముందుకు అంటె రేకు మొదలు వరుకు వంచుకోవాలి, ఇపుడు పువ్వు తయారు అయింది. పువ్వు కు మధ్యలో వ్రుత్తాకారం ఉన్న చొట మన ఫోటో గాని, మనకు ఇస్టమైన వారి ఫోటో గాని పెట్టుకొవచ్చు, లేదా మధ్య లో క్రొవొత్తులు కూడా పెట్టుకొవచ్చు. లెదా వాల్ డెకరేసన్ గా కూడా ఇంటిని అలంకరించుకోవచ్చు.  




  దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వ్యాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.

Tuesday, December 18, 2012

సందు చుక్కలు


అలాగే సందు చుక్కలు, ఇవి ముందుగ క్రింద చూపించిన విధంగ 5 చుక్కలు నిలువుగ పెట్టుకొని చుక్కకు, చుక్కకు మధ్యలో ఇంకొ చుక్క్ల

పెట్టడం ద్వారా సందు చుక్కలు ఏర్పడుతాఇ. ఇక్కడ 5 చుక్కలు నిలువుగ తీసుకొని వాటికి మధ్యలో ఇంకో చుక్క పెట్టుకుంటూ 3 చుక్కలు వచ్చేంత వరుకు పెట్టడం జరిగింది. దీనిని 5-3 సందు చుక్కలుగ పిలుస్తాము.  

ఇపుడు సందు చుక్కల ముగ్గు ఎలా వెయ్యాలో చూద్దాము : 

ముందుగా పెట్టుకున్న చుక్కలును మధ్యలో 3 చుక్కలును ఇలా కలుపుకోవాలి.




తరువతా ఇలా క్రింద చూపించిన విధంగ చుక్కలును కలుపుకుంటూ రావాలి.






పూర్తైన తరువతా నచ్చిన రంగు వేసుకుంటె సరి.  


వెజిటెబల్ సేమ్యా రెసిపి



వెజిటెబల్ సేమ్యా రెసిపి

రుచికరమైన వెజిటెబల్ సేమ్యా రెసిపి కి కావలసిన పదార్థాలు

సేమ్యా   - 1 కప్

నూనె   - 3 స్పూన్లు

జిలకర్ర  - 1/2 స్పూను

ఉప్పు   -  రుచికి తగింత

ఉల్లిపాయ - 1

పచ్చిమిరపకాయలు - 1

క్యారెట్  - 2

క్యాప్సికం - పెదది 1

కొత్తిమీర - కొంచం


తయారు చేయు విధానము: 



ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి.  పాన్ వెచ్చ పడ్డాక అందులో 1 స్పూన్ నూనె వెయ్యాలి.
నూనె వెచ్చ పడ్డాక ఒక కప్పు సేమ్యా తీసుకొని అందులో వేసి లైట్ బ్రౌన్ రంగు వచ్చేంతవరుకు వేయించాలి..   ఇంకో గిన్నెలో 3 కప్పుల నీరు తీసుకొని ఇప్పుడు వేయించిన సేమ్యాని అందులో వేసి ఉడికించాలి, ఉడికించిన తరువాత అందులో ఉన్న నీటిని వంపేయాలి. ఇపుడు పాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ నూనె తీసుకొని, నూనె వెచ్చ పడ్డాక కొంచం జీలకర్ర వెసి దోరగ వెగించాలి, ఇలా వెగించిన తరువాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలను అందులో వేసి వేగించలి, తరువాత అందులో పచ్చిమిరపకాయలును కూడా వేసి వెగించాలి, ఇపుడు అందులో సన్నగ కత్ చెసుకున్న క్యాప్సికం, క్యారట్ లను కుద వెసి, కొంచం ఉప్పు వేసి కలిపి, ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివాలి, అలా మగ్గిన తరువాత, అందులో ఉడికించుకున్న సేమ్యా వేసి మిక్స్ చెసుకొని, ఉప్పు సరి చూసుకొని,  ఒక 3 నిమిషాలు వేఇంచుకోవాలి, ఇపుదు ఎంతో రుచికరమైన వెజిటేబల్ సేమ్యా తయారు, సర్వ్ చెసుకునె ముందు కొత్తిమీర వెసుకుంటె సరి.




Monday, December 17, 2012

రంగవల్లులు 1




రంగవల్లులు లేదా ముగ్గులును చుక్కలు పెట్టి వెయ్యావచ్చు మరియు చుక్కలు పెట్టకుండాను వెయ్యవచ్చు. ముందుగా చుక్కలు ద్వారా ఎలా వెయ్యావచ్చో చూద్దాము.

చుక్కలులో నేరు చుక్క మరియు సందు చుక్కలు అని రెండు రకాలుగా ఉన్నాఇ. 

నేరు చుక్కలును క్రింద చూపించిన  విధంగ ఒకదానికి ఒకటి నేరుగ పెట్టడం అనమాట. ఇక్కడా 5 చుక్కలు నిలువుగా పెట్టి దానికి పైన ఒక చుక్క, క్రింద ఒక చుక్క తగ్గించుకుంటూ 1 చుక్క వచ్చెంతవరుకు పెట్టాలి. ఇలా పెట్టిన దాన్ని మనం 5-1 నేరు చుక్కలు అని అంటాము.


నేరు చుక్కలు


Saturday, December 1, 2012

ఈ కోర్సు లోని భాగాలు :

ఫ్యాషన్ డిజైనింగ్

మగువల మనసు దోచే అందమైన వస్త్రాలను మన శరీరాక్రుతి కి తగట్టు కొత్త నైపుణ్యాలను జోడించి డిజైనింగ్ చెసుకోవడమే ఫ్యాషన్ డిజైనింగ్.
ఈ బ్లాగు ద్వార సులువుగా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ ను ఇంటి నుంచే నేర్చుకోవచ్చు.

ఈ కోర్సు లోని భాగాలు :
  1.   కుట్టు మిషన్ గురించి
  2.   శరీర కొలతలు గురించి
  3.  యాప్రాన్ కుట్టుట
  4.   బ్యాగ్స్ కుట్టుట
  5.   పెట్టి కోట్
  6.   పట్టు లంగా
  7.   సాదా బ్లౌస్ (పిల్లలకు)
  8.   స్కర్ట్స్
  9.   గాగ్రచోలిస్
  10.  ఫ్రాక్స్
  11.  చుడిదార్స్
  12.  ప్యాంట్శ్
  13.  బ్లౌసెస్

పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...