Thursday, January 31, 2013

Wednesday, January 30, 2013

Sunday, January 27, 2013

సీతాకోక చిలుక




కావలసిన వస్తువులు 

పేపెర్ ప్లేట్స్

కత్తెర

గ్లూ

బ్లాక్ స్కెట్చ్ పెన్

స్టాప్లర్

కలర్స్ మరియు బ్రషెస్

బ్లూ లేదా బ్లాక్ కలర్ పేపర్

తయారు చేయువిధానమును  ఈ క్రింద వీడియోలో చూడొచ్చు 


  దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వ్యాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.

Tuesday, January 22, 2013

ఫ్రాక్స్ 1

హయ్ ఫ్రెండ్స్. ఇది నేను చేసిన క్రొత్త ప్రాజెక్ట్.


దీని పై మీ సూచనలు, అభిప్రాయాలును క్రింద ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను. 

ఫ్రాక్స్

హయ్ ఫ్రెండ్స్ .  ఇది నేను చేసిన క్రొత్త ప్రాజెక్ట్.



దీని పై మీ సూచనలు, అభిప్రాయాలును క్రింద ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను.

Sunday, January 13, 2013

సంక్రాంతి శుభాకాంక్షలు


బ్లాగ్ వీక్షకులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు




Saturday, January 12, 2013

కావలసిన వస్తువులు(టూల్స్)


టేప్:  మన శరీర కొలతలు మరియు క్లాత్ ను కొలవడానికి ఈ టేప్ ను ఉపయోగిస్తాము.


కత్తెర: క్లాత్ కట్ చేయడానికి ఉపయోగిస్తాము.


 మార్కెర్ లేదా చాల్క్: క్లాత్ పైన మార్క్ చేయడానికి ఉపయోగిస్తాము.




మిషన్ నీడిల్(సూది):  ఈ సూదుల్లో సైజెస్ ఉంటాయి, మనం తీసుకునే క్లాత్ ను చూసుకొని సూదులును
ఎంచుకోవాలి. పలచని బట్టలకు 15/100, 16/100 సైజ్ గల సూదులును వాడుతాము. జీన్స్ లెదా మందపాటి క్లాత్లకు 19,21 సైజ్ గల సూదులను వాడుతాము.



హెమింగ్ సూది: హుక్స్, కాజాలు, హెమింగ్ చెయడానికి ఈ సూదులను ఉపయోగిస్తాము.



హుక్స్: బ్లౌసెస్ కి కుట్టడానికి వీటిని ఉపయోగిస్తాము.



ప్రెస్సింగ్ బటన్స్



బాబిన్ : ఇది మిషన్ అడుగు బాగంలో సూది బాగానికి క్రింద ఉపయోగిస్తాము.


కేస్ :  బాబిన్ ను ఈ కేస్ లో పెట్టి మిషన్ లో పెట్టడం ద్వార క్రింద కుట్టు పడడానికి ఉపయోగపడుతుంది


స్టిచ్ రిమూవర్:  ఇది కుట్ట్లు తీయడానికి, బుట్టన్ హోల్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.


కుట్టు మిషన్ : దీని ద్వార క్లాత్ ను మనకు నచ్చినట్టుగా కుట్టుకోవచ్చు.


దారాలు 


దీని పై మీ సూచనలు, అభిప్రాయాలును క్రింద ఇవ్వగలరు అని ఆశిస్తున్నాను. 

Monday, January 7, 2013


11-6 సందు చుక్కలు 


11-6 సందు చుక్కలు 


11-6 సందు చుక్కలు 





     11-1  నేరు చుక్కలు 

11-1 నేరు చుక్కలు 

11-1 నేరు చుక్కలు 



Sunday, January 6, 2013

పోపుల పెట్టె

కావలసిన వస్తువులు: 

బిస్కెట్ టిన్స్

డిస్పోజబల్ వాటర్ గ్లాసెస్

కత్తెర

తయారు చేయువిధానము 

వాటర్ గ్లాస్ ను బిస్కెట్ టిన్ హైట్ లో కట్ చేసుకోవాలి, అలానే బిస్కెట్ టిన్ లో ఎన్ని గ్లాస్సెస్ పడతాయో చూసుకొని వాటిని కూడా టిన్ హైట్ లో కట్ చెసుకోవాలి. అలా కట్ చేసుకున్న వాటిని టిన్ లో పెట్టుకొని పోపు దినుసులు పోసుకుంటె సరి, పోపుల పెట్టె రెడి .


  దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వ్యాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.

Saturday, January 5, 2013

టమోటా బాత్



కావలసిన పదార్థాలు:

బొంబాయి రవ్వ                     -            2 కప్పులు

లవంగాలు                            -            2

జిలకర్ర                                 -            1/2 టేబుల్ స్పూన్

పల్లిలు( వేరుశనగ పప్పు)      -             కొన్ని

ఉప్పు                                  -             రుచికి తగినంత

నీళ్ళు                                   -             7 అండ్ 1/2

ఉల్లిపాయ                              -             1

టమోటాలు                            -             3

అల్లం                                     -            చిన్న ముక్క

కరివేపాకులు                         -              కొన్ని

కొత్తిమీర                                -              కొంచం

తయారు చేయువిధానము :

స్టవ్ పైన పాన్  పెట్టుకోవాలి. పాన్ వెచ్చ పడ్డక అందులో 2 టేబుల్ స్పూన్ నూనె వెసుకొని, నూనె వెచ్చ పడ్డాక బొంబాయి రవ్వ వేసి పచ్చి వాసన పోయెంత వరుకు వేగించుకొని ప్లేట్లో  తీసుకొన్న తరువాత అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వెసుకొని నూనె వెచ్చ పడాక అందులో పల్లిలు వెసుకొని వేగించుకొవాలి, కొంచం దోరగా వేగిన తరువాత లవంగాలు, జీలకర్ర వేసి వెగించుకోవలి, ఇపుడు సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు వెసి అందులో కొంచం ఉప్పు వెసుకొని వేగించుకొవాలి, ఒక 2 నిమిషాలు వేగిన తరువాత అందులో  పచ్చిమిర్చి, అల్లం వేసి వేగించాలి, ఇప్పుడు టమోటా ముక్కలును కూడా వేసి మూత పెట్టి మగ్గనివాలి, అలా మగ్గిన తరువాత 1 కప్పు రవ్వకు 3 కప్పుల నీరు , అంటె ఇక్కడ మనం 2 కుప్ప్స్ తీసుకునాము, సొ 6 కప్ప్స్ నీరు తీసుకొని పాన్ లో వేసి నీరు బాగా మరిగిన తరువాత ముందుగా వేగించుకున్న బొంబాయి రవ్వ ను అందులో వెసుకుంటూ కలుపుకోవాలి, ఒక 5 నిమిషాలు తరువాత నీరు మొత్తం అయిపోయి టమోటా బాత్ తయారవుతుంది.  

చట్నీ తయారు చెసుకోవడానికి కావలసిన పదార్థాలు:

వేయించుకున్న పల్లిలు        -   1/4

తినేశనగ పప్పు                   -   1/2

కొబ్బరి                               -    1/2

పచ్చిమిర్చి                         -     4

అల్లం                                 -      చిన్న ముక్క

వెలుల్లి                               -      2

చింతపండు                        -       కొంచం

ఉప్పు                                -       రుచికి తగినంత

నీళ్ళు                                 -       తగినంత

తయారు చేయువిధానము: 

ముందుగా పాన్ తీసుకోని 1/2  స్పూన్ నూనె వెసుకొని అందులో పచ్చిమిర్చి, కొబ్బరి, వెల్లులి, అల్లం, చింతపండు వెసి పచ్చి వాసన పొయెంతవరుకు వేగించుకొవాలి, తరువాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్ని అందులో వేసి గ్రైండ్ చెసుకోవాలి, ఇప్పుడు కొంచం నీరు తీసుకొని  జార్ లో వేసి గ్రైండ్ చెసుకుంటే చట్ని తయారవుతుంది.




గమనిక:

ఇక్కడ నెను చూపించిన  రెసిపి 4 కి సర్వ్ చెయ్యవచ్చు. 1 కప్ బొంబాయి రవ్వ ఇద్దరికి సరిపోతుంది. ఇందులో మీరు 1 కప్ బొంబాయి రవ్వ కి 4 కప్ప్స్ నీళ్ళు వెసుకుంటే సరిపొతుంది.  



పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...