Wednesday, June 11, 2014

పెట్టి కోట్ పార్ట్ - 1


పెట్టి కోట్స్ ను రెండు మూడు రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ పెట్టి కోట్స్ డిజైన్ చేసుకొని స్టిచ్ చేసుకొవడం వస్తే ఛుదిదార్స్ కుట్టు కొవడం కూడ అతి సులభంగా నేర్చుకొవచ్చు.

ముందుగా అతి సులభముగా పెట్టి కోట్ ను ఎలా స్టిచ్ చెసుకోవచ్చో ఇప్పుడు చుద్దాం.
కావలసిన వస్తువులు 
టేపు
కత్తెర
న్యూస్ పేపర్
క్లాత్
క్లాత్ మార్కర్
పెన్ లెదా పెన్సిల్ 

తీసుకోవలసిన శరీర కొలతలు
  • శరీర పొడవు (lenght)
  • చాతి చుట్టుకొలత (chest)
  • నడుము చుట్టుకొలత (waist)
  • నడుము క్రింది చుట్టుకొలత (hips)
  • భుజము (shoulder)
  • చాతి పొడవు
  • నడుము పొడవు
  • నడుము క్రింది పొడవు
 శరీర పొడవును . పొడవును భుజము దగ్గర నుంచి క్రిందకు మనకు కావలసినంత వరుకు తీసుకొవచ్చు.
 ఇప్పుడు చాతి(చెస్ట్) చుట్టుకొలతను, నడుము చుట్టుకొలతను, నడుము క్రింది భాగము(హిప్స్) చుట్టుకొలతను  తీసుకోవాలి.


కట్టింగ్ అండ్ స్టిచింగ్ 
కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ముందుగా పేపర్ పైన ప్రయోగం చేసిన తరువాత క్లాత్ పైన నేర్చుకోవడం శులభతరం అవుతుంది అంతే కాక అందులోని మెలుకువులు కూడ అర్థమవుతాయి.

ఉదాహరణకి
 శరీర కొలతలు తో ఎలా కట్టింగ్ అండ్ స్టిచింగ్ చెయొచ్చో ఇప్పుడు చూద్ధాము .

  •   పొడవు                            - 22 inches
  •   చాతి                                - 34 inches
  •  నడుము                           - 32 inches
  •  నడుము క్రిందిబాగము       - 35 inches
  •  భుజము                           - 15 inches
  •  చాతి పొడవు                     - 10 inches
  •  నడుము పొడవు               - 14 inches
  •  నడుము క్రింది పొడవు       - 20 inches
పైన్ కొలతలను ఉపయొగించి ఏ విధముగ మార్క్ చెయాలో ఇపుడు చుద్దాము

ముందుగా ఒక న్యూస్ పేపర్ ను తీసుకొవాలి.

ఇపుడు పైన తెలిపిన చాతి, నడుము, నడుము క్రింది భాగముల చుట్టుకొలతలలో, ఏ చుట్టుకొలత ఎక్కువగా ఉన్నదో ఆ చుట్టుకొలతను క్లాత్ చుట్టుకొలతగా తీసుకొవాలి , ఇక్కడ నడుము క్రిందిబాగము  35 inches పెద్దది.

కావున మనము ఇక్కడ క్లాత్ చుట్టుకొలతను 35 inches +లూజ్ 2 inches + మారిజన్  4 inches  మొత్తము 41 inches గా తీసుకోవాలి .

అందువలన క్లాత్ చుట్టుకొలతను (వెడల్పు) (width) 41 inches గా తీసుకొవాలి.
పొడవు  22 inches + మారిజన్ 1 1/2  inches = 23 1/2 inches గా తీసుకొవాలి.
అదెవిధముగా మిగిలిన చుట్టుకొలతలకు లూజ్ ను కలిపి మార్క్ చేసుకోవాలి
ఇక్కడ లూజ్ ను కలిపిన తరువాత కొలతలు
  •  చాతి                                - 34 + 2 inches = 36 inches
  •  నడుము                           - 32 + 2 inches = 34 inches
  •  నడుము క్రిందిబాగము       - 35  + 2 inches= 37 inches

petticoat layout
0-1 =  క్లాత్ చుట్టుకొలతను (వెడల్పు) (width) 41 inches = 41/4 = 10. 1/4"
0-2 =  పొడవు   22 inches + 1 1/2 మారిజన్ = 23. 5"
2-3 =   భుజము  15 inches =15-5=10/2 = 5"+ 1/2"
3-4 =  భుజము పొడవు 5 inches
4-5 =  గీత గీయండి
4-6 = 1.5"
2-7 = మెడ వెడల్పు లొ సగము =2.5"
7-8 = మెడ పొడవు
9-10 = చాతి పొడవు  10 inches
9-11 = నడుము పొడవు 14 inches
9-12 = నడుము క్రింది పొడవు 20 inches
13-14 = చాతి 36 inches/4" = 9"
15-16 =  నడుము  34"/4 = 8.5"
17-18 =  నడుము క్రిందిబాగము 37"/4 = 9.1/4"

పేపర్ మార్కింగ్, కట్టింగ్ పెట్టికోట్ పార్ట్ 2 చూద్దాము



Tuesday, June 10, 2014

అనార్కలి స్టెప్స్ సల్వార్

అనార్కలి స్టెప్స్ సల్వార్ ను వెల్వెట్ మరియు డిజైన్ నెట్టెడ్ క్లాత్ ను ఉపయోగించి కుట్టడం జరిగినది




పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...