Wednesday, February 13, 2013

కేసరి లేదా హల్వా



కావలసిన పదార్థాలు 

బొంబాయి రవ్వ  -  1 cup

పంచదార   -  1 cup

జీడి పప్పు, లేద పల్లిలు - కొన్ని

నెయ్యి   -  5 tbs

ఫుడ్ కలర్ -  చిటికెడు

యాలకలు  - 4 or 5

నీళ్ళు   - 3 cups

తయారు చేయువిధానము 
1. ముందుగ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వెచ్చపడ్డాక 2 స్పూన్ ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వెచ్చ పడ్డాక అందులో జీడిపప్పు లేదా పల్లిలును వేసి దోరగ వేగించుకోవాలి.

2. జీడిపప్పు ను వేగించుకున్న తరువాత 1 కప్ బొంబాయి రవ్వను వేసి పచ్చివాసన పోయెంతవరుకు వెగనివ్వాలి. ఇపుడు అందులో యలకలు, 1 కప్ పంచదార వేసి 1 నిమిషం పాటు వెగించుకోవాలి.

3. ఇప్పుడు 1 కప్ బొంబయి రవ్వకు 3 కప్పుల నీళ్ళును పొసుకొని చిన్న మంట పైన  బొంబాయి రవ్వ దగ్గర పడెంతవరుకు కలుపుతూ ఉండాలి.

4. మిశ్రమము దగ్గర పడుతున్నప్పుడు ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఇపుడు మిగిలిన నెయ్యి ని కూడా ఈ మిశ్రమము లో వేసి కలుపుకొని, ఎదైన స్టీల్ ప్లేట్ కు నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేడిగా ఉన్నప్పుడే ప్లేట్ లోకి తీసుకొని అన్నిపైవులా సమానముగ ఉండెటట్టు చదును చెసుకోవాలి. కొంచం చల్లబడిన తరువాత మనకు నచ్చిన షేప్స్ లో కట్ చెసుకుంటే సరి. కేసరి రెడి  


 దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.

1 comment:

  1. This is a surprise dish for me on the valentine day 2013 Feb 14th

    ReplyDelete

పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...