Saturday, February 2, 2013

క్యాప్సికం మస్రూంస్ ఫ్రైడ్ రైస్











కావలసిన పదార్థాలు 

క్యాప్సికం                    -   3

మస్రూంస్                   -   200gms

పచ్చి మిర్చి                 -   కారానికి తగ్గట్టు

లవంగాలు                   -   4

జీలకర్ర పొడి                 -   1/2 tbs

దనియాల పొడి             -   1 tbs

గరం మసాల పొడి         -    1/4 tbs

అన్నము                     -    1 1/2 కప్స్ రైస్

నూనె                          -     2  tbs

సాల్ట్                            -     రుచికి తగ్గట్టు

తయారు చేయు విధానము 

1.ముందుగా మనం తీసుకున్న కాయగూరలను కడిగి పెట్టుకోవాలి. తరువాత వాటిని చిన్న, చిన్న ముక్కలుగ తరిగి పెట్టుకోవాలి.

2. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి, పాన్ వెచ్చపడ్డాక 2 tbs  నూనె వెసుకొని, నూనె వెచ్చ పడ్డాక అందులో లవంగాలు వేసుకొని వేగించుకోవాలి, అలాగె జీడిపప్పు,(లెక పోతె పల్లిలు వెసి కుడా వేగించుకోవచ్చు)

3. జీడిపప్పు లైట్ గా వేగించుకున్న తరువాత, అందులో క్యాప్సికం ముక్కలును, పచ్చి మిర్చి ముక్కలను వేసి, కొంచం ఉప్పు వేసి, మూత పెట్టి బాగ మగ్గనివాలి, మగ్గిన తరువాత అందులో పుట్టగొడుగు ముక్కలను కుడా వేసి మగ్గనివాలి.

4. మగ్గిన తరువాత అందులో జీలకర్ర పొడి, దనియాల పొడి వేసి కొంచం వెగనిచ్చిన తరువాత, ఇప్పుడు ముందుగా ఉడక పెట్టుకున్న అన్నమును వేసి బాగ మిక్స్ చేసుకొని చివరగ గరం మసాల వేసుకొని ఉప్పు సరిచూసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన క్యాప్సికం మస్రూంస్ ఫ్రైడ్ రైస్ రడి.


  దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వ్యాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.

No comments:

Post a Comment

పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...