Tuesday, December 18, 2012

వెజిటెబల్ సేమ్యా రెసిపి



వెజిటెబల్ సేమ్యా రెసిపి

రుచికరమైన వెజిటెబల్ సేమ్యా రెసిపి కి కావలసిన పదార్థాలు

సేమ్యా   - 1 కప్

నూనె   - 3 స్పూన్లు

జిలకర్ర  - 1/2 స్పూను

ఉప్పు   -  రుచికి తగింత

ఉల్లిపాయ - 1

పచ్చిమిరపకాయలు - 1

క్యారెట్  - 2

క్యాప్సికం - పెదది 1

కొత్తిమీర - కొంచం


తయారు చేయు విధానము: 



ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి.  పాన్ వెచ్చ పడ్డాక అందులో 1 స్పూన్ నూనె వెయ్యాలి.
నూనె వెచ్చ పడ్డాక ఒక కప్పు సేమ్యా తీసుకొని అందులో వేసి లైట్ బ్రౌన్ రంగు వచ్చేంతవరుకు వేయించాలి..   ఇంకో గిన్నెలో 3 కప్పుల నీరు తీసుకొని ఇప్పుడు వేయించిన సేమ్యాని అందులో వేసి ఉడికించాలి, ఉడికించిన తరువాత అందులో ఉన్న నీటిని వంపేయాలి. ఇపుడు పాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ నూనె తీసుకొని, నూనె వెచ్చ పడ్డాక కొంచం జీలకర్ర వెసి దోరగ వెగించాలి, ఇలా వెగించిన తరువాత అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలను అందులో వేసి వేగించలి, తరువాత అందులో పచ్చిమిరపకాయలును కూడా వేసి వెగించాలి, ఇపుడు అందులో సన్నగ కత్ చెసుకున్న క్యాప్సికం, క్యారట్ లను కుద వెసి, కొంచం ఉప్పు వేసి కలిపి, ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివాలి, అలా మగ్గిన తరువాత, అందులో ఉడికించుకున్న సేమ్యా వేసి మిక్స్ చెసుకొని, ఉప్పు సరి చూసుకొని,  ఒక 3 నిమిషాలు వేఇంచుకోవాలి, ఇపుదు ఎంతో రుచికరమైన వెజిటేబల్ సేమ్యా తయారు, సర్వ్ చెసుకునె ముందు కొత్తిమీర వెసుకుంటె సరి.




3 comments:

  1. baagundandi parvati gaaru mee semya upma..:)

    ReplyDelete
  2. మీకు మా వెజిటేబల్ సేమ్యా రెసిపి నచ్చినందుకు ధన్యవాదాలు ధాత్రి గారు

    ReplyDelete
  3. Its awesome everybody try at home once please !!!!

    ReplyDelete

పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...