Saturday, December 22, 2012

ఫ్లెవర్స్

ఫ్లెవర్స్ తయారు చెయ్యడానికి కావలసిన వస్తువులు




అట్టపెట్టె

పెన్సిల్

కత్తెర

కలర్స్

పెయింట్ బ్రస్ 

 తయారు చేయు విధానము :

ముందుగ మన దగ్గర ఉన్న చీరల పెట్టెలు గాని, కార్నఫ్లెక్స్  లేదా బిస్కెట్స్ పెట్టెలు గని  తీసుకోవాలి. పెట్టెను ఒక ప్రక్క కట్ చెసుకోవాలి, కట్ చెసుకున్న పెట్టెను వెనుక ప్రక్కకు అంటె తెల్లని ప్రక్కకు తిప్పుకోవాలి, తిప్పుకున్న తరువాత పెన్సిల్ తీసుకొని మనకు కావలసిన పువ్వు సయిజ్ ను బట్టి ఒక సర్కెల్ గీసుకొవాలి, తరువాత దానిని పువ్వులాగ రేకులు వేసుకోవాలి, ఇపుడు కత్తెర తీసుకొని పువ్వు అంచుల చుట్టూ కట్ చేసుకుంటూ రావాలి. కట్ చేసిన పువ్వు కి మనకి నచ్చిన రంగు వేసుకొవాలి, తరువాత పువ్వు రేకులను రంగు వెసుకున్న వైపుకు ముందుకు అంటె రేకు మొదలు వరుకు వంచుకోవాలి, ఇపుడు పువ్వు తయారు అయింది. పువ్వు కు మధ్యలో వ్రుత్తాకారం ఉన్న చొట మన ఫోటో గాని, మనకు ఇస్టమైన వారి ఫోటో గాని పెట్టుకొవచ్చు, లేదా మధ్య లో క్రొవొత్తులు కూడా పెట్టుకొవచ్చు. లెదా వాల్ డెకరేసన్ గా కూడా ఇంటిని అలంకరించుకోవచ్చు.  




  దీని పై గల మీ అమూల్యమైన సలహాలను, సూచనలను క్రింద వ్యాఖ్యలలో ఇవ్వగలరు అని భావిస్తున్నను.

6 comments:

  1. ధన్యవాదాలు ధాత్రి గారు

    ReplyDelete
  2. A pleasent school to get trained ourselves !!!!!!

    ReplyDelete
  3. A pleasent school to train ourselves easily !!!!!!!!!!

    ReplyDelete
  4. మీ ఫ్లవర్ ఐడియా చాల బాగుంది పార్వతి గారు........... దీపాలు పెట్టడానికి మరియు ఫోటో ఫ్ర్మేస్ చుట్టూ పెట్టడానికి చాల బాగుంది.

    ReplyDelete
  5. మీకు మా ఫ్లవర్ ఐడియా నచ్చినందుకు ధన్యావాధాలు శైలజ గారు....:)

    ReplyDelete

పట్టు లంగా బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము

పట్టు లంగా  బ్లౌజ్ డ్రాఫ్టింగ్ విధానము పట్టు లంగా బ్లౌజూ వెనుక  బాడీ డ్రాఫ్టింగ్ 0-1 = ఛాతి చుట్టుకొలత /4 + లూజు  +1 + కచ్చు 0-2 ...